బలపం పట్టి రాస్తాం
బొమ్మలు చక్కగా గీస్తాం!
రంగురంగుల రంగులద్ది
బొమ్మలన్నీ అందంగా చేస్తాం!
అక్షరాలను నేర్చుకుంటాం
అంకెలను లెక్కిస్తాం!
కథలు వింటూ నవ్వుకుంటాం
పాటలు పాడుతూ మురుస్తాం!
చదువుతో జ్ఞానం పెంచుకుని
చక్కని పిల్లలుగా ఎదుగుతాం!

అభిరామ్ వెనిగళ్ల
5వ తరగతి, కెకెఆర్ గౌతమ్ స్కూల్,
పోరంకి, పెనమలూరు మండలం,
కృష్ణాజిల్లా.








కామెంట్‌లు (0)