పర్యావరణాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన_ ప్రతి పౌరుడూ తన కర్తవ్యంగా భావించాలి. ప్రస్తుతం ముందున్న కోరలు చాస్తున్న కాలుష్యాన్ని నివారించేందుకు మనమంతా కృషి చేయాలి. కాలుష్యాన్ని అరికట్టాలి. గాలి, నీరు, భూమి మొత్తం కాలుష్యంగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిరోధించి, ప్రత్యామ్నాయ సంచులు జూట్, గుడ్డ సంచులను వినియోగించుకోవడం ఉత్తమం. నేటి సమాజంలో మనమందరం ఆరోగ్యకర పర్యావరణంలో హాయిగా జీవించాలంటే ప్లాస్టిక్ సంచులను దూరం చేసుకోవాల్సిందే. మనం వినియోగంచే ప్లాస్టిక్ సంచులు రోడ్లపై వేయడం వల్ల మూగజీవాలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాటిని తిని జీర్ణవ్యవస్థ పనిచేయక మరణిస్తున్నాయి._ప్రతి వ్యక్తీ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గోనె సంచిని తీసుకెళ్లడం నేర్పుకోవాలి. అప్పుడే ప్లాస్టిక్ సంచుల నిషేధం జరుగుతుంది.


సిహెచ్. చరణ్, 4వ తరగతి,
శ్రీవిజయ పబ్లిక్ స్కూల్,
చల్లపల్లి, కృష్ణాజిల్లా.








కామెంట్‌లు (0)