ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గురువు గొప్పతనాన్ని చాటిన చిత్రం ‘రఫ్‌ బుక్‌’!

1 గంట క్రితం

Rough_Book_hindi_film_poster.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 07:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నాకు మంచి సబ్జెక్టు ఓరియెంటేషన్‌ ఉన్న సినిమాలు చూడటం ఎంతో ఇష్టం. ఇటీవల మా స్కూలులో భోజన విరామం తర్వాత మా ఇంగ్లీషు టీచర్‌ ‘రఫ్ బుక్’ సినిమా చూపించారు. అది చాలా బాగుంది. ఒక విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య ఉండే అనుబంధాన్ని, చదువు గొప్పతనాన్ని ఈ చిత్రం చక్కగా చూపించింది. ఈ సినిమాలో టీచర్ పాత్ర నాకు ఎంతో నచ్చింది. ఒక ఉపాధ్యాయుడి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి, ప్రోత్సాహం తప్పకుండా ఉంటాయని అర్థమైంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఎంతగా సిద్ధమవుతారో, నిరంతరం అభ్యాసం చేస్తూ ఎంత శ్రమిస్తారో ఈ చిత్రం చక్కగా తెలియజేసింది. అలాగే పుస్తకాల పట్ల ఉపాధ్యాయులకు ఉండే గౌరవం, వాటి విలువను కూడా ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. చివరగా, మన జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అర్థమైంది. మనకు విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గంలో నడిపించే గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలి. విద్యకు విలువనిస్తూ కష్టపడి చదివితే, మన జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని ఈ సినిమా నాకు మంచి సందేశాన్ని ఇచ్చింది.

బి. మోక్ష శ్రీ సౌమ్య.jpg

బి. మోక్షశ్రీ సౌమ్య

పదవ తరగతి, అరవింద మోడల్ స్కూల్,

మంగళగిరి, గుంటూరుజిల్లా.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్