సమయానికి నిద్రలేస్తాం
చక్కగా తయారై బడికి వెళ్తాం!
పెద్దల మాటను గౌరవిస్తాం
పాఠశాల నియమాలు పాటిస్తాం!
తరగతి గదిలో శ్రద్ధగా ఉంటాం
ఇతరులకు ఇబ్బంది కలగనివ్వం!
మా పనులను మేమే చేసుకుంటాం
బాధ్యతతో ప్రతి అడుగు వేస్తాం!
క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుతాం
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం!
మంచి అలవాట్లను అలవరచుకుంటాం
మంచి పౌరులుగా ఎదుగుతాం!

కుంపటి విశ్వక్
1వ తరగతి,
సెయింట్ మదర్ తెరిసా
ఇంగ్లీష్ మీడియం స్కూల్,
చల్లపల్లి, కృష్ణాజిల్లా.








కామెంట్‌లు (0)