చిన్నారులం.. చిన్నారులం..
చిరునవ్వుల చిన్నారులం!
ఆటపాటలతో సందడి చేసే
అందమైన బాలలం!
బుజ్జి బుజ్జి అడుగులేస్తూ
బడికి వెళ్లే పిల్లలం!
చదువుకుంటూ ఎదుగుతూ
చక్కని కలలు కనేవాళ్లం!
నెహ్రూ తాతకు ఇష్టమైన
ముద్దుల పాపాయిలం!
బాలల దినోత్సవ వేళ
సంతోషంగా ఆడుకుందాం!
చదువుతోనే వెలుగులు నింపి
దేశ భవితను మార్చుదాం!
చిన్నారులం.. మేము చిన్నారులం..
చిరునవ్వుల భారత బాలలం!

లంకే యశశ్రీ
5వ తరగతి,
విజయ పబ్లిక్ స్కూల్
చల్లపల్లి, కృష్ణాజిల్లా.








కామెంట్‌లు (0)