హాయ్ ఫ్రెండ్స్!
నాకు ఆడుకోవడమంటే చాలా ఇష్టం. చదువుకోవడమంటే కూడా ఇష్టమే! రోజూ బడికి వెళ్లగానే టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటాను. కొత్త విషయాలు తెలుసుకుంటాను. స్నేహితులతో కలిసి సరదాగా ఆటలు ఆడుకుంటాను. నాకు బంతాటలు ఆడటం, పరుగెత్తడం చాలా ఇష్టం. ఆటలు ఆడుతున్నప్పుడు అందరితో కలిసి ఆనందంగా గడుపుతాను. ఆటల వల్ల మన శరీరం చురుగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటాం. స్నేహితులతో కలిసి ఆడుకోవడం వల్ల కలిసిమెలిసి ఉండటం, ఒకరికొకరు సాయం చేసుకోవడం కూడా నేర్చుకుంటాం. చదువుకుంటూ, ఆడుకుంటూ ఉంటే సమయమే తెలియదు. అందుకే రోజూ కొంతసేపు ఆడుకుంటాను. ఇంటికి వచ్చాక హోంవర్క్ పూర్తి చేస్తాను. పుస్తకాల్లోని సబ్జెక్టు అంశాలను చదువుతాను. బొమ్మలు గీస్తాను. ఇలా చదువుకుంటూ, ఆడుకుంటూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. చదువు మనకు మంచి విషయాలు నేర్పుతుంది. ఆటలు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరం. రోజూ కొంతసేపు ఆడుకుంటూ, మరికొంతసేపు చదువుకుంటే మనం చక్కగా ఎదుగుతాం కదా ఫ్రెండ్స్!
చదువుకుందాం.. ఆడుకుందాం.. ఆరోగ్యంగా, ఆనందంగా ఎదుగుదాం!

పెంటమరాజు ధృవిత
2వ తరగతి, డాన్‌బాస్కో స్కూలు,
గుంటుపల్లి, ఎన్టీఆర్ జిల్లా.








కామెంట్‌లు (0)