సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనా యాత్ర..

1 రోజు క్రితం

4d1dee806fe95babf572cee1cc6bdeaa.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 10:09 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

సాధారణంగా స్త్రీలు యాత్ర అనే ఆలోచన రాగానే 'ఎవరితో వెళ్ళాలి ?' అనే ప్రశ్న వస్తుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తే ఒక రకంగా సులువే. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఎవరికీ వారు బిజీగా వున్నప్పుడు_అది సాధ్యం కాకపోవచ్చు. ఈ మధ్యే ఒంటరిగా వెళ్లుచ్చు అనే ఆలోచన ఊపు అందుకుంటోంది. ఒక్కరే వెళ్ళాలి అంటే విసుగు అనిపిస్తే ఒక గ్రూప్ తో లేదా ఒంటరిగా వెళ్ళదల్చుకుంటేను ఏర్పాటు చేసే సంస్థలు వచ్చాయి. ఇక నా ప్రయాణానికి ఇలాంటి ఒక సంస్థని సంప్రదించాను. ఒంటరి ప్రయాణానికి మొగ్గు చూపాను.

నాకు యాత్ర అంటే పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక యాత్ర కాదు. దేవాలయ_దర్శనం ఒక్కటే ధ్యేయం కాదు. మరో విషయం నాకు నచ్చనిది_మూడు రోజులలో పది ప్రదేశాలు చూడడం. ఆ ప్రదేశం స్వభావ స్వరూపాలు తెలీకుండా_మరో ఊరు పరుగెడతాము. కాలం రోడ్డు మీద ప్రయాణానికే సరి పోతుంది. నాది అంత శ్రమకి ఓర్చుకునే వయస్సు కాదు.ఈ రెండు ఉద్దేశాలు సజావుగా సాగాలంటే నా ప్రయాణాన్ని నేనే నిర్ణయించుకోవాలి అని అనుకున్నాను .

స్త్రీల ప్రయాణం, అందులో వయస్సులో కొంచం_పెద్దవారమైతే చూసుకోవాల్సింది_- దిగవలసిన హోటల్స్_, బుక్ చేసుకునే టాక్సీలు అనుగుణంగా ఉండాలి. ఈ విషయంలో ఈ సంస్థలు_మనకు మంచి గైడెన్స్ ఇస్తాయి.

నేను ఎంచుకున్న ప్రదేశాలు..

తిరువయ్యారు, శ్రీరంగం, తంజావూర్. తమిళనాడులో చుట్టూ చాలా ఊళ్ళు ఉంటాయి. నిజానికి మధురై కూడా చాలా దగ్గర. కానీ తీరుబడిగా చూడాలి అంటే రెండు, మూడు రోజులలో సాధ్యపడదు. అందుకే మధురైని నా ప్లాన్లో కలుపుకోలేదు. ముందుగా త్రిచి వెళ్లి అక్కడ నుంచి ముందుకు_వస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. ఆ ప్రకారంగా త్రిచికి రైలులో బయలుదేరాను. త్రిచికి విమానంలో వెళ్లే అవకాశం వుంది.. కానీ అది మద్రాస్ నుండి మాత్రమే వుంది. అందువలన నేను రైలులో బయలుదేరాను.

ఆదిలోనే హంసపాదులాగ ఆ రోజు రైలు ఆరు గంటలు ఆలస్యంగా నడిచింది. విజయవాడ రావడమే_అర్ధరాత్రి రావాల్సింది_తెల్లవారు జామున_వచ్చింది. నేను ఒక్కదానిని కనుక టెన్షన్ లేదు. ఎప్పుడు రైలు వస్తే అప్పుడు_ఎక్కుదాములే అని నిదానంగా కూర్చున్నాను. మొత్తానికి ఆలస్యంగా బయలుదేరి, మధ్యాహ్నం నాలుగింటికి త్రిచి చేరాను. ముందుగా అనుకున్నట్లే డ్రైవర్, టాక్సీ సిద్ధంగా వున్నాయి. డ్రైవర్ పాండు ఐదారు సంవత్సరాల నుంచి ఆ సంస్థకి పనిచేస్తున్నాడట. చూడగానే నమ్మకం కుదురుతుంది. నన్ను హోటల్లో దింపి మర్నాడు పొద్దునే బయలుదేరుదామని చెప్పి వెళ్ళాడు. రాత్రి అంత నిద్ర లేకుండా రైల్వేస్టేషన్ లో కూర్చోడం, రోజంతా ప్రయాణంతో అలసిపోయి వున్నానేమోఆ రెస్ట్ అవసరం అనిపించింది._ముందుగా తిరువయ్యారు బయలుదేరాను. తిరువయ్యారు చూడాలని ఎప్పటినుంచో కోరిక. అది సంగీత త్రిమూర్తుల జన్మస్థలం. ముగ్గురు ఒకచోటే ఉండడం యాధృచ్చికమో, అప్పటి సామాజిక పరిస్థితులు కారణమో మనకు తెలీదు. అక్కడ దేవాలయం చాలా పురాతనమైనది. విశాలమైన ఆ దేవాలయంలోనే_త్యాగరాజు తన సంగీత ప్రస్థానం_మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో కావేరి, వడవార్, పెన్నార్, వెట్టార్, కురుమురుత్తి_అని ఐదు నదులతో సస్యశ్యామలంగా ఉంటుంది._అక్కడ దేవాలయం చాలా పురాతనమైనది. విశాలమైన ఆ దేవాలయంలోనే_త్యాగరాజు తన సంగీత ప్రస్థానం_మొదలుపెట్టారు. ఈ గుడిని చోళులు నిర్మించారు. ఉత్తర కైలాస భాగాన్ని 10వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు. దక్షిణ కైలాసంని_తరువాత_రాజేంద్రచోళుడు రాణి నిర్మించారు. ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పకళతో పాటు చిత్రకళ వుంది. రెండవ పరిక్రమలో మంటపాల గోడలు మీద అద్భుతంగా చిత్రించారు. కానీ కాల ప్రభావానికి_చాలా చిత్రాలు పాడయ్యాయి. అందులో సందర్శకులు వాటిపై_తమ పేర్లు రాయడం, ఆలయ నిర్వాహకులు చిత్రకళా పరిరక్షణకు ప్రయత్నించకపోవడం ఒక కారణం. ఇప్పుడు వాటికి దగ్గరగా వెళ్లే వీలులేదు. చుట్టూ కటకటాలు వేసి తాళాలు వేశారు. పండగల రోజులు కాదు కనుక ఎక్కువ మంది జనం లేరు. దర్శనం అవగానే, త్యాగరాజ సమాధి దగ్గరకు వెళ్ళాను.

కావేరి నది ఒడ్డున శిథిలమవుతున్న త్యాగరాజ స్వామి సమాధి_బెంగళూరు నాగరత్నమ్మ బాగు చేయించి, ఒక గుడి కట్టించారు. ఆ పక్కనే నాగరత్నమ్మ గారి సమాధి కూడా వుంది. కావేరి నది ఒడ్డునే_త్యాగరాజ ఉత్సవాలు సమయంలో కిక్కిరిసిపోయి ఉంటారు_జనం. ఆ రోజు ఎవరూ_లేరు. ఆ సమాధి కూడా శుభ్రంగా ఉంచారు. ఆ గోడలు మీద స్వామి పంచరత్న కీర్తనలు తెలుగులో, తమిళంలో గోడలు మీద చెక్కి వున్నాయి. ఆ పక్కనే త్యాగరాజస్వామి నివసించిన ఇల్లు ఉంది. నాకు తెలియక పోవడం వల్ల వెళ్ళలేదు.

మర్నాడు తంజావూర్. నేను ఇంతకు ముందు తంజావూర్_చూసాను. కానీ అప్పుడు సరస్వతి మహల్ వెళ్లడం కుదరలేదు. దానికితోడు ఈ మధ్య వచ్చిన పొన్నియన్ సెల్వం సినిమా వల్ల తంజావూర్_మీద, బ్రహదీశ్వర ఆలయం మీద అందరికి_ఆసక్తి పెరిగింది. నాకు సహాయపడడానికి_వచ్చిన గైడ్ ‘పొన్నియన్ సెల్వం’లో ప్రస్తావించిన దారి -కంచి నుండి తంజావూర్_దాక-_ఇప్పుడు_టూర్లు వేసేవాళ్లకి_ఒక టీమ్ అయ్యిందని వివరించాడు. అంతకన్నా ముందు శ్రీరంగం వెళ్ళాలి అనుకున్నాను. శ్రీరంగంలో రంగనాథుడు, జంబుకేశ్వర స్వామీ_ఆలయం వుంది. ఆలయం విశాలమైనది. పూర్తిగా ద్రావిడ సంప్రదాయం. పెద్ద మండపాలు, శిల్పాలతో అలంకరించిన స్తంభాలతో చాలా బాగుంటుంది. అటునుంచి రంగనాథుడి దగ్గరకు వెళ్ళాము. అక్కడ జన సమ్మర్ధం ఎక్కువ. ఆలయం_ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తే, బయటకు అదే ద్వారం నుంచి రావాలంటే పద్మ వ్యూహమే. ఆలయంలో_శిల్ప సంపద ఎంతో గొప్పది.

బ్రహదీశ్వర ఆలయం మన పూర్వీకుల ఇంజనీరింగ్ పాటవానికి గొప్ప నమూనా. అంత_ పెద్ద ఆలయం ఎలా నిర్మించారో_అర్థం కాదు.

శిల్పాలు..పెయింటింగ్స్‌..

ఇక్కడికి రావడానికి ముందు కావేరి నది ఒడ్డున తంజావూర్_లోహ శిల్పాలు తయారు చేసే artisans ఇంటికి వెళ్లాను. ఆయన ఆ శిల్పాలు ఎలా తయారు చేస్తారో_చూపాడు. అది కావేరి మట్టితో సాధ్యం అంటాడు. అయితే ఇక్కడ వున్నా శిల్పాల సంఖ్య చూస్తే కొంచెం_అనుమానం వేస్తుంది. ఇలాంటి చోట కొనేటప్పుడు_జాగ్రత్తగా ఉండాలి. వారి దగ్గర సరైన బిల్ తీసుకోవాలి. ఒక్కోసారి విమానాశ్రయంలో చెకింగ్_ సమయంలో బిల్ ఉంటే ఏంకాదు. దేవుడి_శిల్పాలు దొగతనం ఎక్కువుగా_ఉండడం_వల్ల_ఈ జాగ్రత్త అవసరం. లేదా_ప్రభుత్వ సంస్థలైన_పూమ్_పుహార్ లో కొనుక్కోవాలి. అక్కడ ఒకటి రెండు చిన్న శిల్పాలు కొని, తంజావూర్_పెయింటింగ్స్ కి అవసరమైన ముడిసరుకు తయారుచేసే యూనిట్ ని చూసాము. _చూడాలని అనుకుని వెళ్ళింది సరస్వతి మహల్ లైబ్రరీ. అయితే దీనిలో ముఖ్యమైన తాళపత్ర గ్రంధాలు_చూడాలి అంటే మనకి_రీసెర్చ్ స్కాలర్ అని ఒక పత్రం చూపాలి. అయితే ప్రదర్శనకు కొన్ని తాళపత్ర నమూనాలు మ్యూజియంలో ఉంచారు. ఇది కొంచెం నిరాశ కలిగించింది. దీంతో_చూడదలచుకున్న_ముఖ్యమైన ప్రదేశాలు చూసినట్లే.

ఒంటరి ప్రయాణంలో_కొంత స్వేచ్ఛ_ఉంటుంది. మన ఆసక్తి తగ్గట్టుగా ప్రయాణం ప్లాన్_ చేసుకోవచ్చు. ముందుగా రిజర్వేషన్స్_చేసుకుని_ఉంటే ఎక్కువ శ్రమ పడకుండా తిరగగలము. తంజావూరులో భోజనం చేస్తున్నపుడు_నేను ఒక్కదానినే ఉన్నానని_గమనించి ఒక అమ్మాయి నేను కూర్చోవచ్చా అని అడిగింది. మాటలలో_తాను కోయంబత్తూర్ లో పనిచేస్తూ బ్రహదీశ్వర ఆలయం చూడాలని వచ్చానని అంది. నేను ఒక్కదాన్ని దూరం నుంచి వచ్చాను అని తెలిసి ఆశ్చర్యపోయి - మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం వచ్చింది. నాకు ఎన్నో ప్రదేశాలు చూడాలని వున్నా ఒక్కదాన్నే అని ఆగుతున్నాను. ఇప్పుడు కూడా భయం భయంగా వచ్చానని అంది. అలా మరో సోలో ట్రావెలర్ కి బీజం వేశానని_తృప్తి. ఇదే అనుభవంగా.._తరువాత రెండుచోట్లకివెళ్లాను.

బాలాంత్రపు ప్రసూన


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్