ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లల ప్రత్యేక సంచిక .. బాలల రచనలకు ఆహ్వానం ....

1 గంట క్రితం

Special Issue for Children .. Inviting Contributions from Young Writers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రియమైన చిన్నారులూ ,


బాలల దినోత్సవం సందర్భంగా ‘‘ప్రజాశక్తి స్నేహ’’ అనుబంధం మీ కోసం ఒక ప్రత్యేక సంచికగా వెలువడుతోంది. పిల్లల సంతోషమే మా సంతోషం. ఇందులో మీరు రాసే రచనలకు, గీసే బొమ్మలకు ప్రాధాన్యతనిచ్చి ప్రచురిస్తాం. కథలు, కవితలు, బొమ్మలు, పుస్తక సమీక్ష‍లు ఇలా అన్ని రచనా పక్రియల్లోనూ మీ సృజనకు ఈ సంచికలో చోటుంటుంది. మీరు రాసిన కథ, కవిత, కనువిందుచేసే బొమ్మలూ, దసరా సెలవుల్లో మీరు సందర్శించిన ప్రదేశాలు, మీరు చదివిన పుస్తకాలపై సమీక్ష‍లు వంటివన్నీ ప్రచురిస్తాం. ఈ సంచికలో ప్రచురితం కాని రచనలు తర్వాత సంచికల్లో వీలును బట్టి ప్రచురిస్తాం. అయితే మూఢనమ్మకాలు, దేవుళ్లు, దెయ్యాలు వంటి అతీతశక్తులను బలపర్చే రచనలను ప్రచురించలేము. ప్రజల ఐక్యత, సమానత్వం, మతసామరస్యం వంటి అంశాలపై శాస్ర్తీయ దృక్పథంతో కూడిన మీ కథలూ, గేయాలూ, చిత్రాలూ పంపండి.

సంపాదకులు

అడ్రస్





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్