నేలను ముద్దాడేలా వాన చినుకులు
చెవులను తాకేలా లయబద్ధమైన సంగీతం
మనసును మౌనంగా నిలిపేలా చిరునవ్వుల రాగాలు
పులకరించేలా ప్రకృతి
వీచే సన్నని చిరుగాలుల_
సుతిమెత్తని పలకరింపులు_
హృదయాన్ని సుతారంగా తాకుతాయి
అంతరంగాన్ని నింపేలా అనుభూతుల అలలు!_
మరచిపోలేని జ్ఞాపకాల తోటలో_
ఆనందపు పూల వికాసం !_
చూరు అంచుల నుండి జారి పడే చినుకులు _
ప్రతిబొట్టులోనూ ఒక జీవ గీతం !
చినుకుల ఆప్యాయత
పులకించిన పుడమితల్లి
మట్టి పరిమళాల ప్రేమ
వెదజల్లే ప్రాణాన్ని, పరవశాన్ని
ఆనందించే అరుదైన సంఘటన !_
ఆకులపై వాన బిందువులు మంచి ముత్యాల్లా _
ప్రకృతి నుదుట అందమైన తిలకాలు !
పక్షుల కిలకిలారావాల సందళ్లు_
పొలాల పచ్చదనం కలిసి
హృదయాన్ని మైమరపించేలా !_
వర్షం కేవలం నీటిని కురిపించదు ..
ఎండిపోయిన నేలకు జీవం !_
అలసిన మనసులకు నింపేను ఆశను !_
మూగబోయిన జ్ఞాపకాలకు_
కొత్త శ్వాస
నవ్యత్వాన్ని ప్రసాదిస్తుంది!
అందుకే...
కురిసే ప్రతి వాన చినుకు ఓ మధురానుభూతి !
ప్రతి జలధార ఒక_ సుజలదృశ్యం_!_
ప్రతి వర్షం ప్రకృతి రాసే ప్రేమ కావ్యం !_
_గొర్రెపాటి శ్రీను








కామెంట్‌లు (0)