ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​వెలుగుల వెనుక నీడ..

1 గంట క్రితం

kavi1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 08:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కాంక్రీటు అడవుల మధ్య

పచ్చని జ్ఞాపకాలు

భవనాల పునాదుల్లో సమాధి

రంగుల బ్రోచర్లలో

చూపించిన స్వర్గం

చెక్ రూపంలో చేతికి వచ్చాక

చిరునామా లేని నిర్బంధమై కూర్చుంది

సూటూ బూటూ వేసుకున్న

అభివృద్ధి సంతకం

నీ తరతరాల ఆత్మగౌరవాన్ని

వేలంలో పెట్టింది

ఏ రోడ్డు పక్కనో నిలబడి

నీ సొంత భూమి వైపే చూస్తూ

అనుమతి లేక అడుగుపెట్టలేని

పరదేశివి అయిపోయావు

అభివృద్ధి కొలిచే సూచీల్లో

నీ నవ్వుల గణాంకాలు ఉండవు

కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో

నీ ఆక్రందనలకు ఖాతా ఉండదు

పరిహారపు నోట్ల కట్టలు

పొలం వాసనను భర్తీ చేయలేవు

ఏసీ గదుల చల్లదనం

నేల కోల్పోయిన సెగను చల్లార్చలేదు

అభివృద్ధి అంటే

కొందరికి ఆకాశ హర్మ్యాలు

మరికొందరికి సొంత నేలపైనే

అనాథలుగా మిగలడం!

వైష్ణవి శ్రీ

8074210263

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్