ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆకాశరేఖ

1 గంట క్రితం

kavi 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 08:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆమె అడుగే ఒక ఆకాశరేఖ

భూమిపై పడిన ప్రతి అడుగూ

ఓ కొత్త దారికి ఆరంభం

ఆమె నడిచే దారిలో

ఆశల మొగ్గల చిగళ్లు

చూపు తాకిన చోట

ఆత్మవిశ్వాసం వృక్షమై

ఆమె కలం కదిలితే

నిశ్శబ్దాలు కూడా మాటలే

ఆలోచనలు ఉప్పొంగే అలలు

సమాజ తీరాలను తాకుతాయ్‌

ఆమె కుటుంబాన్ని మాత్రమే కాదు

ఒక తరాన్ని నిర్మించే శక్తి

అమ్మగా ప్రేమను పంచుతూ

త్యాగానికి కొత్త అర్థం

చెబుతోంది

ఆమె భావి భారత భవితకు దిక్చూచి

జ్ఞాన దీపాలను వెలిగించే జ్యోతి

అక్షరాలకు ప్రాణం

విద్యార్థుల కలలకు మార్గదర్శి

అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా

ఆగని ఆమె ప్రయాణం

అక్షరాల అశ్వంపై స్వారీ

లక్ష్యదిశగానే జీవనయానం

కన్నీరే విజయగాథలు

అసాధ్యాలను సుసాధ్యాలుగా

సమాజానికి దారి చూపే ఉదయరేఖ ఆమె !!


చిత్రాడ కిషోర్ కుమార్, 9866912906


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్