ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యాకులత

1 గంట క్రితం

Anguish
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మనసు గోడలపై మొలిచిన నిశ్శబ్ద లత

కాలం కుట్టిన గాయాలపై

కనిపించని కుట్లు

నవ్వు వెనుక దాచిన నీటి సంతకం

ఎవరైనా శ్రద్ధగా గ్రహించాలి..

ఆలోచనల అరణ్యంలో

దారి తప్పిన గాలి అడుగును

ఎవరైనా ఆత్మీయులు పసి గట్టాలి..

​నిద్ర కంటిపై వెలగని దీపపు వత్తిని

ఎవరైనా ప్రేమాన్విత సరి చేయాలి...

​గుండె గదిలో ప్రతిధ్వనించే ప్రశ్నల పక్షుల

అలజడిని ఎవరైనా హరిత ప్రేమి వినాలి...

​ఆశల విత్తనాలపై

అనుమానాల మంచు తెరనే వ్యాకులత...

​ఓటమి కాదు

అర్థం కోసం ఆత్మ చేసే అన్వేషణ....

చీకటే ఎక్కువైనప్పుడు

వెలుగు తన చిరునామా వెతికే వేళ

కన్నీటి బిందువులో

భవిష్యత్తు మొగ్గ దాగి ఉంటుంది తెలుసా...

​తేటపడిన మనసు

వ్యాకులతను జ్ఞాపకంగా మలుస్తుంది చూడు

చివరికి...

వ్యాకులతే

మనిషిని మనిషిగా చెక్కే


డా.కటుకోఝ్వల రమేష్,

సెల్:9949083327

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్