చిన్ని మా నవీక్ష
పెద్దల దీవెనలు_
నీకు అండాదండా !
అమ్మ నాన్నల
గారాల పట్టి_
నాన్నమ్మ తాతల
మురిపాల చిట్టి!
తల్లిదండ్రుల
కలల బుజ్జాయి_
అమ్మమ్మ తాతల
బుజ్జి పాపాయి!
పలకరించిన చాలు
నవ్వులే కురిపించు
చిలిపి అల్లరితోను
అందరిని అలరించు!
ఆయురారోగ్యాలు_
నీ చెంత నిలవాలి
భోగభాగ్యాలు_
నీ వెంట నడవాలి!
రాబోయే చదువులకు
వాణిగా మెరవాలి
ఆట పాటల్లో_
మంచి పేరునే తేవాలి!
స్నేహ గీతిక పాడే
చిన్ని మా నవీక్ష
చదువు సంధ్యలందు
తీర్చాలి మా ఆకాంక్ష!
ఏడాది గడిచి
జన్మదినము వచ్చే
అందరీ దీవెనలు
అందుకోవమ్మా!
వంద పుట్టినరోజులు
వరుసగా జరుపుకొని
సరదాగా సందడిగా_
నిత్యమూ ఉండమ్మా!
బి.వి.పట్నాయక్
8309872913








కామెంట్‌లు (0)