ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓయ్ ఒంటరి!!

20 సెప్టెంబర్, 2026

Oray.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 08:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గది తలుపులు వేసుకుని

మది తలుపులు మూసుకుని

కొత్త తలపులు మానుకుని

ఒంటరివై నువ్వో జంటెరుగని

బ్రతుకు బురద గుంటన ఈదే

తుంటరి ఆలోచనల పోగయి

ఎన్నాళ్ళు ఎన్నేళ్ళిలా మగ్గి

మరుగుతూ కరిగి పోతావు

అలాఅలాగే ఒరిగి పోతావు


గెలిచేందుకు లోకం లేదా ?

జతపడి సాగే దారే లేదా ?

ఒంటరి తలపులు తెంచెయ్

మది తలుపులు తెరిచెయ్

గది గొళ్ళెం బ్రద్దలు కొట్టెయ్

జన గణంలో అంతా నీ వాళ్ళే

వాళ్ళతో జతపడి జమపడి

నడిచావంటే రేపన్నది నీదే!!


ఉన్నం వెంకటేశ్వర్లు

87900 68814

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్