గౌరీ దేవి దివ్య ఆదరువు
బతుకునిచ్చే ప్రేమ చెరువు
పల్లెంలో పువ్వుల కొలువు
రంగుల సింగడి నెలవు
ఆనందోత్సాహాల తావు
లేదెపుడూ పూలకు కరువు_
స్త్రీత్వం ఉట్టిపడే బతుకమ్మలు_!
బతుకమ్మ చుట్టు పట్టుచీరలు
తంగేడు పసుపు పూరేకులు
గునుగు గుబాళించే రేవులు
సీత జడ పూల చిత్ర విచిత్రాలు
ముద్ద బంతి పూల మురిపాలు
గుమ్మడి పువ్వుల్లో గౌరమ్మలు
కోలాటాలు, జనపదాల హోరులు
ఊరు వాడల్లో జోరు ఊరేగింపులు_
బతుకమ్మ సంతోషాల విందులు
పూల పండుగ హేలలు
తెలంగాణ అంతటా పూల జాతరలు
పల్లె పట్నాల్లో బతుకమ్మ సంబరాలు !
బంగారు బతుకునియ్యవే బతుకమ్మ
గుమ్ముల నిండా సిరిసంపదల నియ్యవే
ఆయురారోగ్యాల్ని ప్రసాదించవే మాయమ్మ
తీరోక్క పూల సింగిడి సుగంధాలు చల్లవే
ప్రకృతి సౌందర్యాల్ని ప్రసాదించవే మా తల్లి
పూల గోపురాల గుడికి వందనాలు మాత
అంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా..
ఊరు వాడ ఊరేగవే మా ముద్దుల బతుకమ్మ !
మధుపాళీ
9949700037








కామెంట్లు (0)