మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతి కోసం

09 ఆగస్టు, 2026

prapancha santhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 09:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

యుద్ధాలు

రక్తపాతాలు

ఆధిపత్య పోరులు

నెత్తురోడుతున్న నేల గుండెలో

ప్రపంచం అలసిపోయింది

శాంతి కోసం నింగి అంచువరకూ ఎదురుచూస్తోంది

బూటకపు ఒప్పందాల

శాంతి కాదు

ద్వంద్వ ప్రమాణ కాగితాలపై ఊరికే వీగిపోయే

ఒట్టొట్టి శాంతి కాదు

నిజమైన శాంతి కావాలి

ప్రతి మనిషి గుండెను భరోసాతో నింపే శాంతి కావాలి

కానీ

సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం,

ఒక దేశం మరో దేశంపై విరుచుకుపడినంత కాలం,

ఒక మనిషి మరో మనిషిని అమానవీయంగా చంపినంత కాలం

శాంతి రాదు

రానే రాదు

సామ్రాజ్యవాదం అంటే ఏమిటా?

పెద్ద దేశాలు చిన్న దేశాలను పీడించడం,

బలవంతులు బలహీనులను చిత్రహింస పెట్టడం,

ధనికులు పేదవారి

రక్తం పీల్చడం.

అంతా తిమింగిలాలు చిరుచేపలను మింగే

తెలిసిన కథే!

ఇది నశించాలి.

ఈ దురాశ, దౌర్జన్యం, అమానవీయత

పూర్తిగా నశించాలి.

అప్పుడే నిజమైన, శాశ్వతమైన శాంతి సాధ్యపడుతుంది.

సోషలిజమే దీనికి పరిష్కారం.

ఎందుకంటే అది మనిషికి విలువ ఇస్తుంది.

అది ఆకలిని రూపుమాపుతుంది.

అది అణచివేతను

అంతం చేస్తుంది.

సోషలిజం అంటే ఏమిటి?

ఒక్కొక్కరి కోసం కాదు-

అందరి కోసం.

కొద్దిమంది లాభం కోసం కాదు-

సమష్టి మంచి కోసం.

సోషలిజంలో

యుద్ధాలకు చోటు లేదు.

ఎందుకంటే అక్కడ

మనిషి మనిషికి

శత్రువు కాదు.

తోడు, తోబుట్టువు అని

సోషలిజంలో

సరిహద్దులు ఉండవు.

గుండెల్లో

ద్వేషానికి తావు ఉండదు.

ప్రతి బిడ్డకు చదువు,

ప్రతి మనిషికి పని,

ప్రతి కుటుంబానికి గౌరవం-

ఇవే ఇవే ఉంటాయి.

శాంతి కోసం మిగిలి ఉన్న

ఒకే ఒక మార్గం

సోషలిజం మాత్రమే.

ఇదే పరిష్కారం.

సామ్రాజ్యవాదం నశించి

సోషలిజం నిలిస్తే కానీ

ప్రపంచం శాశ్వత శాంతి నిలయమవదు.

రేపటి ప్రపంచమే

నేటి మన కల.

కార్మికుల చేతుల్లో,

రైతుల కష్టంలో,

విద్యార్థుల కలల్లో,

ప్రతి మనిషి నమ్మకంలో

సోషలిజమే వెలుగు,

శాంతియే గమ్యం.

​శాంతిశ్రీ

8333818985

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్