సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదిగదిగో అణగారిన_గొంతుల_నినాదం

30 ఆగస్టు, 2026

There—the rallying cry of suppressed voices.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

__

___పల్లవి:- అదిగదిగో అణగారిన గొంతుల__నినాదం

అసమానత వివక్షలు తొలగించే నినాదం

_ _ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ కులాల అడ్డుగోడలు

___కూల్చేందుకు మ్రోగింది సామాజిక శంఖారావం

​

___జాతి మతం వేరైనా ఏకత్వం మన భారతం

___భాషలు ఎనున్న సమానత్వం మననినాదం

___తక్కువెక్కువ తేడాలు ఐక్యతకు అవరోధం

__ఈ అస్థవ్యస్థ లోపాలను సరిదిద్దగ కదలాలి

​

_శ్రమజీవి చెమటతో సోమరుల గొంతు తడిపి

__గంజి నీళ్లు ఆసరాతో ధనికుల కోటలు కట్టిరి

__ మీ దేవుళ్ళకు మారక్తం నొసటి బొట్టయ్యే __

__మేం గుడిగడప ఎక్కితే ఛీ.. ఛీ మైలంటారే

​

__పనిని బట్టి కులాల విభజన జరిగెను సత్యం

__వర్ణాశ్రమ ధర్మమనే మాయగీతలు కల్పితం

__బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మెట్ల కుంపటినీ

__వ్యవస్థాగతం__చేశారు భూస్వామ్య ధోపిడిని

​

ఊరిదేవర సంబరాల్లో నాట్యమాడె బొమ్మలనుచేసిరి

జోగినీల పేరుతో కాముకులు స్త్రీల జీవితాలు దోచిరి

ఆదిపత్య కులమతాలు స్త్రీల ఆత్మగౌరవాన్ని హరించిరి

సనాతన సంక్కెళ్ళు వేసి స్వేచ్ఛగొంతు నులుమితిరి

​

వేదనలు రోదనలతో ఎంతకాలం కుములుదాం

భూమి పొరలు చీల్చుకొని క్రొత్తగా మొలకెత్తుదాం

ప్రజల హక్కుల సాధనకై సమూహాలై కదులుదాం__

మనుసిద్ధాంతపు కృష్ణబిలాన్ని తొలగించగ పోరుదాం


జి.నటరాజు

9490098420

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్