ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొక్కు తొట్టి

1 గంట క్రితం

‘‘బాలబంధు’’ అలపర్తి వెంకటసుబ్బారావు (కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత) 94408 05001
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ఊరువెళ్తు సుందరమ్మ

ఉండుననీ భద్రంగా

మూటకట్టి నగలన్నీ

మూలగదిలొ వున్నట్టీ

​

తుక్కుతొట్టిలో వేసెను

అక్కడితో ధైర్యమొచ్చె!

సుందరమ్మ ఊరి నుండి

తొందరగా తిరిగి వచ్చె!!

​

అయినా ఆ నగలమూట

అచటి నుండి తీయలేదు

అక్కడ నగలున్న మాటె

అసలామెకు గుర్తులేదు!!

​

ఒక్కనాడు ఆ వీధికి

తుక్కుకొనే మనిషి వచ్చె!

అమ్మెను ఆ తుక్కంతా

ఆ మనిషికి సుందరమ్మ!!

​

పేరంటానికి నగలను

పెట్టుకు వెళ్లాలి గనుక

తుక్కులో నగల విషయం

తోచె సుందరమ్మ కపుడు

​

‘‘అమ్మితి ఆ తుక్కు నిన్న

అయ్యో! నా నగలు పోయె!

అతనిని ఎక్కడ వెతికెద?

అని వగచెను సుందరమ్మ

​

అంతలోనె తుక్కు మనిషి

అచటి కొచ్చి చెప్పినాడు

‘‘నా తక్కులొ వచ్చెను మీ

నగల మూట పొరపాటున!

​

ఇతరుల సొత్తొద్దనుకొని

ఇచ్చేద్దామని వచ్చా!’’

అనెను సుందరమ్మ గూడ

‘అచ్చీ! నిను నే మెచ్చా!’’


‘‘బాలబంధు’’ అలపర్తి వెంకటసుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

94408 05001

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్