- ఎఐ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీల సమ్మిళిత వేదిక
- అపెక్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న భవిష్యత్ సాంకేతిక నగరం షెన్జెన్
బీజింగ్ : అపెక్ శిఖరాగ్ర సమావేశానికి వేదికైన చైనాలోని షెన్జెన్ నగరం ఇప్పుడు ప్రపంచ దృ ష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ నగరాన్ని ప్రపంచ దేశాలు ‘ఎఐ వండర్ల్యాండ్’ అని భవిష్యత్ సాంకేతిక నగరమని పిలుస్తారు. నగరమంతా నిత్య జీవితంలో క త్రిమ మేథ (ఎఐ), రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ మిళితమైన ఓ అద్భుత వేదికగా కన్పిస్తుంది. షెన్జెన్ నగరం అనేక అద్భుతాలను మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది. వివిధ పరిశ్రమలు, గ హ అవసరాలకు ఉపయోగపడే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలను ఇక్కడ నేరుగా చూడవచ్చు. అంతేకాదు...వాటిని ఆపరేట్ కూడా చేయవచ్చు. మనుషులతో ప్రమేయం లేకుండా రోబోటిక్ చేతులతో కాఫీ, లాటే ఆర్ట్, ఐస్‌క్రీమ్ వంటి వాటిని తయారు చేసి అందించే కేఫ్‌లు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
కాఫీ కావాలా... డ్రోన్ అందిస్తుంది
నగరంలోని టాలెంట్ పార్క్, ఇతర ఎక్స్పీరియన్స్ కేంద్రాలలో రోబో డాగ్స్, చదరంగం ఆడే రోబోలు, బాక్సింగ్ రోబోలు కన్పిస్తాయి. మెదడు తరంగాలతో పని చేసే పరికరాలను కూడా పరీక్షించవచ్చు. షెన్జెన్ బే, టాలెంట్ పార్క్ వంటి ప్రదేశాలలో మీకు కావాల్సిన కాఫీ లేదా ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఆకాశం నుంచి డ్రోన్లు నేరుగా వాటిని నిర్దేశిత లాకర్ల వద్దకు చేరుస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత డ్రోన్ తయారీ సంస్థ డిజెఐ యొక్క అతి పెద్ద స్టోర్ ఈ నగరంలోనే ఉంది. సందర్శకులు ఇక్కడ సరికొత్త డ్రోన్లను స్వయంగా ఎగరేసి పరీక్షించవచ్చు.
డ్రైవర్ లేకుండానే రయ్ రయ్
షెన్జెన్ నగరంలోని రోడ్లు రద్దీగా ఉంటాయి. వీటిపై డ్రైవర్ లేకుండానే పూర్తిగా ఎఐ ఆధారంగా నడిచే క్యాబ్‌లలో ప్రయాణించవచ్చు. మానవ రహిత మెట్రో, క్యాప్సూల్ బస్సులు కూడా ఉంటాయి. ఆటోమేటెడ్ సబ్వే రైళ్లు, డ్రైవర్ రహిత క్యాప్సూల్ బస్సులు ఇక్కడి ప్రజా రవాణాలో భాగంగా ఉన్నాయి. షెన్జెన్లో సాంకేతిక ఆకర్షణలకు కొదవేమీ లేదు. గ్వాంగ్మింగ్ జిల్లాలోని షెన్జెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం భవనం అంతరిక్ష నౌక ఆకారంలో ఉంటుంది. ఇది ఏఐ, స్పేస్ టెక్నాలజీ ప్రదర్శనలకు కేంద్రంగా విలసిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ హువాకియాంగ్బేలో ఏఐ గాడ్జెట్లు, స్మార్ట్ గ్లాసెస్, ఎక్సోస్కెలిటన్ (నడకకు సాయపడే రోబోటిక్ సూట్లు) అందుబాటులో ఉంటాయి. టాలెంట్ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాలలో డోపమైన్ స్థాయిలను పెంచే ఏఐ ఫిట్‌నెట్ పరికరాలు, స్మార్ట్ బెంచీలను ఏర్పాటు చేశారు.








కామెంట్లు (0)