బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలికపై రోబోట్ లైంగిక దాడి

2 గంటల క్రితం

roabot
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రోబో యజమాని అరెస్ట్

బెర్లిన్: ఒక రోబోట్ 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసింది. ఈ ఘటన జర్మనీలోని కొలోన్‌లో జరిగింది. ఒక రెస్టారెంట్ బయట 16 ఏళ్ల బాలికపై హ్యూమనాయిడ్ రోబోట్ లైంగిక దాడికి పాల్పడింది. రోబోట్ యజమాని అయిన 16 ఏళ్ల బాలుడిని, అతని స్నేహితుడైన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోబోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రోబోట్ యజమాని, అతని స్నేహితుడు ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొలోన్ నగర కేంద్రంలోని ఒక ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్ సమీపంలో స్నేహితులతో కలిసి నిలబడి ఉన్న 16 ఏళ్ల బాలికను రోబోట్ వెంబడించి, పట్టుకుని వేధించింది. దీంతో ఆ బాలిక కేకలు వేసి అక్కడి నుంచి తప్పించుకుంది. సమాచారం అందిన వెంటనే, అత్యవసర దళాల బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను, రోబోట్‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కారు వెనుక దాచి ఉంచిన రోబోట్‌ను గుర్తించారు. పోలీసులు రోబోట్‌తో పాటు నిందితుడికి చెందిన రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. రోబోట్‌ను ఎవరైనా రిమోట్‌గా నియంత్రించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్