గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇక తెలియని నంబర్ల నుంచి కాల్ వచ్చినా పేరు కనిపిస్తుంది..

16 గంటల క్రితం

cnap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 12:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కొత్త సాంకేతికతతో కేంద్రం కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌కు తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వస్తే ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇకపై ప్రత్యేక యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది. కాల్‌ చేసే వ్యక్తి పేరును నేరుగా ఫోన్‌ స్క్రీన్‌పై చూపించే కాలింగ్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ (సినాప్-CNAP) వ్యవస్థను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వ్యవస్థ ద్వారా ఫోన్‌లో నంబర్‌ సేవ్‌ చేయకపోయినా, టెలికాం సంస్థల వద్ద నమోదైన వివరాల ఆధారంగా కాలర్‌ పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ ఎవరివో తెలుసుకోవడానికి చాలామంది ట్రూకాలర్‌ వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే సినాప్ వ్యవస్థ టెలికాం సంస్థల వద్ద ఉన్న చందాదారుల వివరాల ఆధారంగా పనిచేస్తుంది. దీంతో కాలర్‌ పేరును తెలుసుకోవడానికి ప్రత్యేక యాప్‌ లేదా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం ఉండదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్పామ్‌ కాల్స్‌, మోసపూరిత కాల్స్‌ను గుర్తించడం కొంత సులభం కావచ్చని భావిస్తున్నారు. అయితే ఫోన్‌లో కనిపించే పేరు ఆధారంగానే కాల్‌ నిజమైనదని నమ్మకూడదు. మోసగాళ్లు ఇతర పద్ధతుల్లోనూ ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది.

టెలికాం శాఖ 2026 నవంబర్‌ 1 నుంచి 4G, 5G తదితర అనుకూల నెట్‌వర్క్‌లలో ఈ సేవను అమలు చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఫోన్‌లో సేవ్‌ చేసిన పేరు ఉంటే అదే కనిపిస్తుంది. నంబర్‌ సేవ్‌ చేయకపోతే టెలికాం రికార్డుల్లో నమోదైన పేరు కనిపిస్తుంది. కాలర్‌ ఐడెంటిటీని దాచే సిఎల్ఐఆర్ సదుపాయం పొందినవారి పేరును మాత్రం ప్రదర్శించరు.

ఈ కొత్త సాంకేతికతతో తెలియని కాల్స్‌ విషయంలో వినియోగదారులకు మరింత సమాచారం అందనుంది. అయితే పేరు కనిపించినంత మాత్రాన మోసపూరిత కాల్స్‌ పూర్తిగా ఆగిపోతాయని చెప్పలేం. ఓటిపిలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో ఎవరికీ వెల్లడించకుండా అప్రమత్తంగా ఉండటం అవసరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్