తెలంగాణ : 2019 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన జరిగిన ప్రాంతం సమీపంలోనే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన బాధితురాలు శంషాబాద్ కు వెళ్లడానికి క్యాబ్ ఎక్కింది. అయితే, తోండుపల్లి టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే డ్రైవర్ కారును దారి మళ్లించాడు. సమీపంలోని కొత్వాల్‌గూడ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన బాధితురాలు వెంటనే కారులోంచి బయటకు దూకి గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిపోయిన డ్రైవర్, ఆమె వద్ద ఉన్న రూ. 60 వేల నగదు ఉన్న బ్యాగును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ... పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
మహిళపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)