జహీరాబాద్ అర్బన్ : కళాశాలలో కనీస వసతులు కల్పించడంతో పాటు ప్రిన్సిపల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ .... జహీరాబాద్ మండలం అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. జహీరాబాద్-పొట్‌పల్లి రహదారిపై సోమవారం బైఠాయించి నిరసన కొనసాగించగా.. విద్యార్థులకు గ్రామ సర్పంచి చల్లా శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్థులు మద్దతు తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రంగా కొనసాగుతున్న కళాశాలలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు తోడు ప్రిన్సిపల్ వేధింపులు మితిమీరిపోయాయని వాటిని తట్టుకోలేక రోడ్డుపైకి వచ్చామంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. జహీరాబాద్ ఎస్సై లవకుమార్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు సర్ది చెప్పారు. మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడించారు. ప్రిన్సిపల్ బదిలీ సహా సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కళాశాల విద్యార్థుల రాస్తారోకో
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 10:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)