ముంబయి : ఎల్‌ఐసిలో 6 శాతం వాటాల విక్రయ ప్రక్రియ మొదలైంది. మంగళవారం నుంచి ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఈ వాటాలను అమ్మడం ద్వారా రూ.31,000 కోట్లు పైగా రాబట్టుకోవాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎల్‌ఐసి షేర్లను 10 శాతం తక్కువకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ దెబ్బతో మంగళవారం ఎల్‌ఐసి షేర్లు 8.66 శాతం పతనమై రూ.391.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 9.26 శాతం పడిపోయాయి. ఇది గత నాలుగు నెలల కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2022లో తొలిసారిగా వాటాలను విక్రయించింది. తాజాగా సోమవారం 2 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించగా.. అదనంగా మరో 4.5 శాతం వాటాను ఉపసం హరించుకునే (గ్రీన్‌షూ ఆప్షన్) అవకాశాన్ని కూడా కల్పించింది. ఒక్కో షేరు ధరను రూ.382 చొప్పున భారీ డిస్కౌంట్‌తో నిర్ణయిం చారు. ఈ వాటాల విక్రయంతో ఎల్‌ఐసిలో 10 శాతం వాటాలు ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుల్లో రూ.80 వేల కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ పిఎస్‌యు వాటా విక్రయాల ద్వారా ప్రభుత్వం సుమారు రూ.21,200 కోట్లను సమీకరించింది.
Print Editionఎల్‌ఐసిలో 6% వాటాల విక్రయం షురూ
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 01:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)