telangana : అమెరికాలో ఉన్నత చదువులను పూర్తి చేసి తిరిగి తన స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకోవాలనుకున్న తెలంగాణ యువకుడు ... అగ్నిప్రమాదంలో తీవ్రగాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి (29) గత నెల 25 న ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 75 శాతం కాలిన గాయాలతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడు.. దాదాపు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లిన భరత్.. చదువు పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలని భావించారు. ఇంతలోనే జరిగిన అగ్నిప్రమాదం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భరత్ మృతితో గంటూరుపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
అమెరికాలో అగ్నిప్రమాదం - చికిత్స పొందుతూ తెలంగాణ యువకుడు మృతి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)