తెలంగాణ : రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అనుమతి నిరాకరణ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో రేవంత్ పోస్ట్ పెట్టారు. ‘‘రాజకీయ కారణాల రీత్యా నా అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నా. విదేశీ పర్యటన అంశంలో నాకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నాను. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు వస్తున్నా. అక్కడికి వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతా. గత మూడు రోజులుగా పార్టీ, నేతలు, ప్రజల నుంచి లభించిన అద్భుతమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు వస్తున్నా.. అన్ని అంశాలపై మాట్లాడతా : సిఎం రేవంత్
23 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)