శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిమజ్జనాల వేళ.. యువతులతో అసభ్య ప్రవర్తన - 1530 మంది గుర్తింపు

14 గంటల క్రితం

Indecent behavior towards young women during immersion processions – 1,530 individuals identified.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన వేడుకల వేళ ఆకతాయిల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిమజ్జనానికి వచ్చిన యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన 1,530 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 724 మందికి షీటీమ్స్‌ కౌన్సెలింగ్‌ ఇవ్వగా, 48 మందిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుండటంతో నగరంలో భారీగా ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. నిమజ్జన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీస్‌, ట్రాఫిక్‌ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని హైదరాబాద్‌ సిపి సజ్జనార్‌ తెలిపారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు. నిమజ్జనాల నేపథ్యంలో శనివారం కూడా ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని సిపి సజ్జనార్‌ తెలిపారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని, వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని కోరారు. ట్రాఫిక్‌ పోలీసులు జారీ చేసే అధికారిక అడ్వైజరీలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్‌ ప్రాంతాలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారని సిపి తెలిపారు. భారీ రద్దీ కారణంగా వాహనాల రాకపోకలు మందగించడంతో నిమజ్జన ప్రక్రియ కొంత ఆలస్యమైందన్నారు. నిమజ్జన శోభాయాత్ర శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. శాంతియుతంగా నిమజ్జనోత్సవం పూర్తయ్యేలా నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని సిపి సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్