మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మొండికేసిన ఆన్ లైన్ సర్వీసులు - మెట్రో ప్రయాణీకుల అవస్థలు

6 గంటల క్రితం

Severe hardships for Hyderabad Metro passengers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులు మంగళవారం తీవ్ర అవస్థలుపడ్డారు.. చివరికి సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం అనూహ్యంగా సాంకేతిక కారణాలతో .. మెట్రో స్టేషన్‌లలో గూగుల్‌పే, ఫోన్‌పే, వాట్సాప్‌ సేవలు.. ఇలా ఆన్‌లైన్‌ పేమెంట్ల సర్వీసులన్నీ పని చేయలేదు. దీంతో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్ల వద్ద భారీ క్యూ లు కనిపిస్తున్నాయి. పలు స్టేషన్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. ఆన్‌లైన్‌ పేమెంట్ల నేపథ్యంలో క్యాష్‌ దొరక్క చాలామంది ఇబ్బందులుపడుతున్నారు. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ప్రయాణికులు సహనం కోల్పోయి అందోళనకు దిగారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు కారణంపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేదు. అయితే రద్దీ, ప్రయాణికుల ఆగ్రహం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్