హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో 50 శాతం పైగా జెన్‌జీలు ఓట్లు వేయబోతున్నారని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడుతూ .... యువతరం కొత్త తరహాలో ఢిల్లీలో కదం తొక్కిందన్నారు. ప్రధాని మోడి ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకున్నారని అన్నారు. వాట్సాప్ అంకుల్స్.. ఇన్‌స్టా పిల్లల్లో ఎవరు గెలిచారో చూశామన్నారు. అర్ధరాత్రి ప్రధాని మోడి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేశారని, సోషల్ మీడియా లేకపోతే జవాబుదారీతనం వచ్చేది కాదు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతంపైగా జెన్‌జీలు ఓట్లు వేయబోతున్నారని అన్నారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య పిల్లలు పేపర్లు, టీవీలు చూడటం లేదనీ, నేటి యువత న్యూస్‌ను రీల్స్ రూపంలో చూస్తోందని కెటిఆర్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో 50 శాతం పైగా జెన్‌జీలు ఓట్లు వేయబోతున్నారు : కెటిఆర్
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)