mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ కొత్త సిఎస్‌గా సంజయ్ జాజు .. కేంద్రం ఉత్తర్వులు

12 గంటల క్రితం

Sanjay Jaju named new Chief Secretary of Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర తదుపరి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సంజయ్‌జాజు నియమితులయ్యే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణ సిఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణారావు ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సిఎస్ ఎంపికపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రేసులో ఉన్న జయేశ్‌రంజన్‌తో పాటు సంజయ్‌జాజు పేర్లను పరిశీలించి చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ జాజును తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్