సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొలిమేర 3 లో అర్జున్‌

52 నిమిషాల క్రితం

Polimera-3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘పొలిమేర’ ఫ్రాంచైజీ మూడో భాగంలో ప్రముఖ నటుడు అర్జున్‌ ‌కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ‘యాక్షన్‌ ‌మీట్స్‌ ‌పవర్‌’ అనే క్యాప్షన్‌‌తో అర్జున్‌ ‌కు సంబంధించి ప్రమోషనల్‌ ‌వీడియోను సోషల్‌ ‌మీడియా ద్వారా షేర్‌ ‌చేసింది. మిస్టరీ, హారర్ కథాంశాలతో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన పొలిమేర -1, పొలిమేర 2 వరుస సినిమాలు హిట్‌ ‌కొట్టాయి. ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించాయి. తాజాగా ‘పొలిమేర 3’లో అర్జున్‌ ‌సర్జా భాగం కావడం పట్ల ఈ మూవీపై హైప్‌ ‌క్రియేట్‌ అయింది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ నందిపాటి, భోగేంద్ర గుప్తాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్