శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కుప్పకూలిన ఏడంతస్తుల భవనం - ఇద్దరు మృతి

12 గంటల క్రితం

Seven-storey building collapses – Two dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవల నిర్మాణం పూర్తయిన ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. భవన శిథిలాల కింద చిక్కుకున్నవారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఆ శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో దాని గోడలు కూడా ధ్వంసమయ్యాయి. సమీపంలోని హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిహెచ్‌ఎంసి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం వేళ ఈ ప్రమాదం జరిగి ఉంటే మరింత భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్