సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలో ప్రారంభమైన ఎస్‌ఐఆర్‌ సర్వే

25 జూన్, 2026

SIR survey launched in Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ సర్వే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నేటి నుండి జులై 24 వరకు సర్వే చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ నగర్ వార్డు కార్యాలయంలో బిఎల్‌ఒలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. బిఎల్‌ఒలు ఇంటింటికి వెళ్లి వాటిని ఓటర్లకు అందించాలని అన్నారు. ఓటర్లు ఈ దరఖాస్తులను పూర్తి చేసి రెండు రోజుల్లో తిరిగి బిఎల్‌ఒలకు అందించాలని అన్నారు. ఏదైనా అత్యవసర సేవల కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని కోరారు. ఒక వేళ బిఎల్‌ఒలు ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఇంగ్లిష్‌లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. బిఎల్‌ఒలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్‌ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందించాలని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉన్నారని, వచ్చే నెల 24లోపు సర్వే పూర్తి కావాలని అధికారులు సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్