శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

15 గంటల క్రితం

Software Engineer Commits Suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 10:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : ‘ఐ ట్రైడ్‌... లూసర్‌’ అని నోట్‌ రాసి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 17 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల మేరకు .... జార్ఖండ్‌ రాష్ట్రం బొకారో స్టీల్‌ సిటీకి చెందిన సుజిత్‌ పండిట్‌ కుమార్‌ (26) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని వాసవి జీపీ ట్రెండ్స్‌లో త్రీ బీహెచ్‌కేలో నివాసముంటున్నాడు. ఒక రూమ్‌లో సుజిత్, మరో రెండు రూమ్‌లలో హర్ష, వివేక్‌లు ఉంటున్నారు. మిగతా ఇద్దరు కంపెనీలకు డ్యూటీకి వెళ్లగా, రాత్రి సమయంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసిన సుజిత్‌ గురువారం ఇంటి వద్దనే ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకడంతో సుజిత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే సుజిత్‌ కొంతకాలంగా షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయడంతో దాదాపు రూ.25 లక్షల నష్టం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్‌ యాప్‌లలో లోన్‌ తీసుకోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ‘ఐ ట్రైడ్‌... లూసర్‌’ అని ఓ చిట్టీపై నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉన్న సోదరుడు అజిత్‌ పండిట్‌ కుమార్‌ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని సోదరుడికి అప్పగించారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్