శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదాయంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఆల్-టైమ్ రికార్డు

10 గంటల క్రితం

Telangana Commercial Taxes Department sets all-time revenue record.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 03:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. జులై 2026 నెలలో అత్యధికంగా రూ.7,865 కోట్ల ఆదాయాన్ని సేకరించి, ఇప్పటివరకు ఒక్క నెలలో వచ్చిన గరిష్ట ఆదాయంగా కొత్త చరిత్ర నమోదు చేసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్థిక పురోగతి, మెరుగైన పన్ను నిబంధనల అమలు, శాఖ చేపడుతున్న పటిష్టమైన చర్యల వల్ల ఈ ఘనత సాధ్యమైంది.


సరికొత్త ఆల్-టైమ్ రికార్డు..

గతంలో ఏప్రిల్ 2026లో వచ్చిన 77,598 కోట్ల రాబడియే ఇప్పటివరకు అత్యధికం కాగా, ఈ జులైలో సేకరించిన 77,865 కోట్లతో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. జులై 2025లో వచ్చిన 76,624 కోట్లతో పోలిస్తే, ఈసారి రూ. 1,241 కోట్లు (19% వృద్ధి) అదనంగా ఆదాయం సమకూరింది. మొత్తం రాబడిలో జీఎస్టీ ఆదాయమే రూ. 4,452 కోట్లుగా ఉంది. గతేడాది జులై (73,638 కోట్లు)తో పోలిస్తే జీఎస్టీ వృద్ధిలో ఏకంగా 22% పెరుగదల కనిపిస్తోంది. తెలంగాణలోని పన్ను చెల్లింపుదారుల నుండి వసూలైన మొత్తం జీఎస్జీటీ రాబడి (IGST, CGST, SGST కలిపి) 75,819 కోట్లకు చేరింది. జులై నెల జీఎస్టీ వృద్ధిరేటు (19%) విషయంలో దేశంలోనే హర్యానా తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అఖిల భారత సగటు వృద్ధిరేటు 10%గా మాత్రమే ఉంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, కొత్త పెట్టుబడులు రావడం, వినియోగం పెరగడమే కాకుండా.. పన్ను ఎగవేతదారులపై సాంకేతికత (Data Analytics) సాయంతో కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రాబడి సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎమ్. రఘునందన్ రావు తెలిపారు.


రూ.7300 కోట్ల నకిలీ ఐటీసీ (ITC) స్కామ్ గుర్తింపు..

జూలై నెలలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సరఫరా లేకుండానే బోగస్ బిల్లులతో రూ. 300 కోట్ల మేర ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) పొందేందుకు యత్నించిన 165 మంది. పన్ను చెల్లింపుదారులను గుర్తించి, వారి రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేయడం వంటి చట్టపరమైన చర్యలు చేపట్టారు. సక్రమంగా పన్ను చెల్లించే వారిని గౌరవిస్తూనే, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిపై జీఎస్ఓటీ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు. సకాలంలో పన్నులు చెల్లించిన 4,61,276 మంది తెలంగాణ పన్ను చెల్లింపుదారులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్