సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

TG - గణేశుడి నిమజ్జనాల్లో పలుచోట్ల అపశ్రుతి

1 రోజు క్రితం

TG - Untoward incidents reported at several places during Ganesha immersion.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : గణేశుడి నిమజ్జన వేడుకల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చోట్ల అపశ్రుతి చోటుచేసుకున్నది. కరీంనగర్, నాగర్​కర్నూలు, నిర్మల్‌‌ జిల్లాల్లో ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. కరీంనగర్​జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన తాండ్ర రుద్ర (18) మల్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా.. ఎస్సారెస్పీ కెనాల్‌‌లో జారిపడ్డాడు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయిన రుద్ర కోసం పోలీసులు, అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఎల్ఎండీ ప్రాంతంలో రుద్ర మృతదేహం దొరికింది. సోమశిల వద్ద వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా హైదరాబాద్‌‌లోని ఉప్పుగూడకు చెందిన ఎస్‌‌.రాజు (37) కృష్ణనదిలో పడి చనిపోయాడు. ఉప్పుగూడకు చెందిన 20 మంది యువకులు నాగర్‌‌‌‌కర్నూలు జిల్లా కొల్లాపూరు మండలం సోమశిల దగ్గర కృష్ణానదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చారు. అయితే, రాజు నదిలో గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టి.. మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ పంచాయతీ పరిధిలోని కుర్రగూడలో నీటమునిగి ఒకరు మృతి చెందారు. వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా.. కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌‌‌లో చుంచు రమేశ్‌‌ (45) ప్రమాదవశాత్తు పడిపోయాడు. నిర్వాహకులు వెంటనే రమేష్ ‌ను నీళ్లలో నుంచి బయటకు తీసినా.. అప్పటికే అతడు మృతి చెందాడు. రమేష్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌‌ వినాయక నిమజ్జన శోభాయాత్రలో ప్రమాదం చోటుచేసుకున్నది. 20 ఏండ్ల యువకుడు ప్రమాదవశాత్తూ వాహనం కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్