తెలంగాణ : హైదరాబాద్ నగరాన్ని బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లును తెలంగాణ శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... హైదరాబాద్‌లో రవాణా కోసం కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ చేశామని తెలిపారు. హైదరాబాద్ విస్తరణ పెద్దఎత్తున జరుగుతోందని, రాబోయే 30 ఏళ్ల అవసరాల దృష్ట్యా మరింత సమర్థంగా పాలన కోసం క్యూర్ చట్టం రూపొందించామని చెప్పారు. ‘‘మూసీ పునరుజ్జీవం తొలిదశకు రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇచ్చాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం. జీహెచ్‌ఎంసీని ట్రై కార్పొరేషన్లుగా విభజించుకున్నాం. అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేసేలా చట్టబద్ధ వ్యవస్థను రూపొందించాం. సీఎం అధ్యక్షతన క్యూర్ అత్యున్నత పాలకమండలిని ఏర్పాటుచేస్తున్నాం. మహానగరపాలిక చట్టంలో సెక్షన్లు తగ్గించే ప్రణాళిక. మురుగునీటిని శుద్ధి చేసి చెట్ల పెంపకం, కాలుష్య నివారణకు వాడాలని ప్రభుత్వ యోచన. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ రూపొందించుకుని ముందుకెళ్తున్నాం. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచ నగరాలతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ ఎదగాలి. పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించే స్థాయికి మనం చేరుకోవాలి. హైదరాబాద్ గత వైభవాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయాలి’’ అని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ చట్టం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చిన్నపాటి సాంకేతికపరమైన 400 రకాల నేరాలను.. నేరపూరిత పరిధి నుంచి తొలగించాలని మంత్రి శ్రీధర్‌బాబు సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందని తెలిపారు. చాలా కేసుల్లో చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం అందరికీ ఉపయోగపడాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ చట్టాలకు సంబంధించి కలెక్టర్లు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం : శ్రీధర్ బాబు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)