హైదరాబాద్ : అత్యవసర వైద్య చికిత్స కోసం అవయవాలు తరలించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్‌కు గుండె, ఊపిరితిత్తుల్ని తరలించేందుకు సహకరించారు. వైద్యులు 14 కి.మీ దూరంలోని కిమ్స్‌కు కేవలం 25 నిమిషాల్లో వాటిని విజయవంతంగా చేర్చారు. అత్యవసర ఆరోగ్య కార్యక్రమాల కోసం మెట్రో మద్దతిస్తుందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కాపాడే వైద్య చర్యలకూ తమ వంతు సహకారం ఉంటుందన్నారు.
అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ మెట్రోలో అవయవాల తరలింపు
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)