బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర వ్యాప్తంగా లాయర్స్ ధర్నా

7 గంటల క్రితం

రాష్ట్ర వ్యాప్తంగా లాయర్స్ ధర్నా
- రిటైర్మెంట్‌ ‌బెన్‌‌ఫిట్స్‌ అందించాలి
హైదరాబాద్ క్రిమినల్ కోర్టు వద్ద నిరసనలో కె పార్థసారథి 
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రిటైర్మెంట్‌ ‌బెన్‌‌ఫిట్స్‌ అందించాలి

హైదరాబాద్ క్రిమినల్ కోర్టు వద్ద నిరసనలో కె పార్థసారథి


ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం లాయర్లు ధర్నాలు చేశారు. జిల్లా కోర్టుల వద్ద నిరసనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి మాట్లాడుతూ.. అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టం 2001ను సవరించి న్యాయవాదులందరికీ రిటైర్మెంట్/మరణానంతర ప్రయోజనంగా రూ.25 లక్షలు అందించాలన్నారు. న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య సమయంలో రూ.5లక్షల వైద్య సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. జూనియర్ న్యాయవాదులందరికీ ఐదేళ్లపాటు నెలకు రూ. పది వేలు స్టైఫండ్ అందించాలని కోరారు. జాతీయ కౌన్సిల్ తీసుకున్న తీర్మానం మేరకు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో బుధవారం ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. న్యాయవాదులు రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను కాపాడుతూ ప్రజా సేవ చేస్తున్నారని, అయినప్పటికీ అనేకమంది న్యాయవాదులు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఐలు హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు డి.ప్రవీణ్ కార్యదర్శి సి.రామచంద్ర రెడ్డి, ఎన్ వెంకటయ్య, అలీ హైదర్, దుర్గ, కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొని ప్రసంగించారు. ఐలు విద్యార్థి విభాగ నాయకులు అనిల్ కుమార్, సుజిత్, అలీ జాన్, చంద్రకాంత్, మొహమ్మద్ అలీ, శరత్, మొహమ్మద్ తఖీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్