శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు

10 గంటల క్రితం

Amit Shah's visit to Telangana cancelled.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం (అక్టోబర్ 4 న) తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రద్దు చేసుకున్నారు. ముందుగా ప్రకటించాల్సిన షెడ్యూల్‌ ప్రకారం .... కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌కు వస్తారని బిజెపి వర్గాలు భావించాయి. ఇటీవల తెలంగాణకు కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌లతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందని బిజెపి నేతలు అనుకున్నారు. అమిత్‌ షా ఆదివారం తూప్రాన్‌ మండలంలోని బ్రహ్మణపల్లిలో పర్యటించనున్నారన్న సమాచారం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఎఎస్‌ఎల్‌ సమావేశం నిర్వహించారు. అమిత్‌ షా పర్యటనకు సంబంధించిన భద్రతా ప్రణాళిక వేసుకున్నారు. చివరకు అమిత్ షా పర్యటన రద్దయింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్