శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం

7 గంటల క్రితం

అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం
- రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
- హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

- హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్


ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన పూలను దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతా భావానికి ఈ పండుగ నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు. తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప‌ర్యాట‌క శాఖ స్పెష‌ల్ సిఎస్ వాణిప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్‌తోపాటు ప‌లువురు కార్పొరేషన్ చైర్ ప‌ర్స‌న్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్