గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రెవిన్యూ సేవలు సమర్థవంతంగా అందించాలి

20 జూన్, 2026

రెవిన్యూ సేవలు సమర్థవంతంగా అందించాలి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : మండలంలోని ప్రజలకు రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించాలని తహసీల్దారు పి. బ్రహ్మయ్య రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు . తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని కట్ చేశారు. సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవల పట్ల అలసత్వం వహించకుండా ప్రజలకు మంచి సేవలను అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో వై శ్రీనివాస్ రావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్