గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీతాలు పెంచాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన అంగన్వాడీలు

5 రోజుల క్రితం

Anganwadi workers submitted a memorandum to the Gandhi statue demanding a salary hike.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 03:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి జిల్లా నాయకులు మేడిశెట్టి దుర్గమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ కు 2019 నుండి వేతనాలు పెరగలేదని, ఈ కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, అంగన్వాడీలకు రకరకాల యాప్ లు తెచ్చి పని భారం పెంచారన్నారు. ఈ కాలంలో వేతనాలు పెంచాలని చేసిన అనేక పోరాటల ఫలితంగానే 2024 జులై నెలలో వేతనాలు పెంచుతామని మినిట్స్ కాపీ ఇచ్చారని, 2026 మార్చి ఆందోళన తర్వాత మార్చి 10వ తారీఖున ఐసిడిఎస్ మంత్రివర్యులు అంగన్వాడీ యూనియన్ నాయకులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తో మాట్లాడి త్వరలోనే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని కానీ ప్రభుత్వం నేటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులందరికీ పిఆర్సి వేస్తామని ప్రకటన చేశారనీ, అంగన్వాడీలకు వెంటనే కనీస వేతనాలు, ఈఎస్ఐ,పిఎఫ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తున్నందుకుఅభినందనలు తెలియచేసారు.రూరల్ లో ఉన్న అంగన్వాడీలకు వారి కుటుంబమునకు వితంతు, వృద్ధాప్య పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు ఏమీ అమలు కావడం లేదని అన్నారు. అంగన్వాడీ పిల్లలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని హెల్పర్లు ప్రమోషన్ గైడ్లైన్స్ ఇచ్చిన జి ఓ సవరణ వలన ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా కొన్ని మినీ సెంటర్లు మెయిన్ సెంట్రల్ గా అప్గ్రేడ్ కాలేదని , వెంటనే వీటిని పరిష్కరించాలని అన్నారు.. అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రూరల్ లో ఉన్న అంగన్వాడీలకు వారి కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనీ.పెండింగ్ లో ఉన్న మినీ సెంటర్ లను మెయిన్ సెంట్రల్ గా అప్డేట్ చేయాలనీ, మినీ వర్కర్ కి మెయిన్ వర్కర్ తో సమానంగా వేతనాలు ఇవ్వాలనీ,.1972 పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ చట్ట ప్రకారం సర్వీసులో ఉండి చనిపోయిన మధ్యలో మానుకున్న గ్రాడ్యుటీ అమలు చేయాలనీ, .పెండింగ్ టి ఏ బిల్లులు ఇవ్వాలనీ, లబ్ధిదారుల మెనూ పెంచి. ఫ్రీ స్కూల్ పిల్లలకి 100 గ్రాములు బియ్యం, 25 గ్రాములు కందిపప్పు, 10 గ్రాముల ఆయిల్ కాంటినెంట్స్ ఒక్కొక్కరికి కనీసం ఐదు రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకులు విజయలక్ష్మి, సూర్య కుమారి, చంద్రకళ ,దుర్గ, జహర, దుర్గా లక్ష్మీ అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
Anganwadi workers submitted a memorandum to the Gandhi statue demanding a salary hike.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్