బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి : ఇటుక బట్టీ యజమానులు

2 గంటల క్రితం

ఇసుక బట్టీ యజమానులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 03:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రూ.10 వేలు ఫీజుగా ఇసుక బట్టీ యజమానులు స్పష్టీకరణ


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఇటుక బట్టీ యజమానుల నుంచి ఎమ్మెల్యే పేరుతో రూ.10 వేల చొప్పున వసూలు చేశారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను ఆలమూరు ఇటుక బట్టీ యజమానులు తీవ్రంగా ఖండించారు. ఆలమూరులోని శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ఇటీవల మైనింగ్ అధికారులు బట్టీ యజమానులకు భారీ మొత్తాలు చెల్లించాలని సూచించిన నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక చొరవ తీసుకుని మైనింగ్ అధికారులతో చర్చించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ఇటుక బట్టీకి రూ.10 వేల రాయల్టీ ఫీజు మాత్రమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తాము చెల్లించిన మొత్తం ప్రభుత్వ ఖజానాకే రాయల్టీ ఫీజుగా వెళ్లిందని, ప్రతి చెల్లింపునకు అధికారిక రసీదులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఆలమూరు, చొప్పెల్ల యూనియన్లకు చెందిన బట్టీ యజమానులు రాయల్టీ ఫీజును చెల్లించిన విషయాన్ని అప్పట్లో మైనింగ్ శాఖ అధికారులే అధికారికంగా వెల్లడించారని, దీనికి సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో బట్టీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అప్పట్లో మైనింగ్ పేరిట ఇటుక బట్టీ యజమానులను దారుణంగా దోచుకున్నారని, అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రాయల్టీ ఫీజు చెల్లిస్తున్నామని, అలాంటి విషయాలను వక్రీకరించి రాజకీయ ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఇటుక బట్టీ యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సలాది నాగేశ్వరరావు, తాడి శ్రీనివాసరెడ్డి, వంటిపల్లి సతీష్ కుమార్, ఈదల నల్లబాబు, సూరపురెడ్డి సూర్యనారాయణ, తదితర బట్టీల యజమానులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్