న్యూఢిల్లీ : చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి) 105వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ(ఎం) శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సిపిసికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సిపిఐ(ఎం) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా అభివృద్ధి, పరివర్తనకు దశాబ్దాలుగా సిపిసి అందించిన నాయకత్వాన్ని ప్రశంసించింది. చైనా అభివృద్ధి, పరివర్తనకు కృషి చేసిన దశాబ్దాల నాయకత్వంపై ప్రశంసలు కురిపించింది. జాతీయ పునరుజ్జీవనం, సామాజిక న్యాయం, శ్రేయస్సుకు నమూనాగా పనిచేసే చైనా లక్షణాలకు అనుగుణంగా సిపిసి చేపట్టిన సామ్యవాద ఆవిష్కరణలను కొనియాడింది. ఆర్థిక పురోభివృద్ధిలో, సాంకేతిక ఆవిష్కరణ, పేదరిక నిర్మూలనలో ప్రస్తుతం చైనా ప్రపంచ అగ్రగామిగా నిలిచింది. మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచే విధంగా కోట్లాది మంది ప్రజలు తీవ్ర దారిద్ర్యం నుండి బయటపడ్డారని ఆ ప్రకటనలో తెలిపింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య సిపిసి సాధించిన విజయాలను అభినందించింది. బహుళపాక్షికవాదం, శాంతియుత అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కొనసాగుతున్న సాంకేతిక సహకారాన్ని ( 'దక్షిణ-దక్షిణ') పెంపొందించడంలో చైనా పోషిస్తున్న పాత్రను, తద్వారా ప్రపంచ వ్యవహారాల్లో నిర్మాణాత్మక సహకారాన్ని అందించడాన్ని కూడా సిపిఐ(ఎం) ప్రశంసించింది. భారత్, చైనా ప్రజలతో పాటు ప్రపంచ శాంతి, పురోగతి కోసం ఇరు పార్టీల మధ్య స్నేహం, సహకారం, ఉమ్మడి నిబద్ధతను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది.
సిపిసి 105వ వార్షికోత్సవానికి సిపిఐ(ఎం) శుభాకాంక్షలు
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 02:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)