ప్రజాశక్తి - జగ్గంపేట : అమరావతి చాంపియన్ షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు జగ్గంపేట విద్యార్థిని ఎంపికయ్యింది. స్థానిక శెట్టిబలిజిపేటకు చెందిన పాలిక గంగాభవాని విద్యలో, క్రీడల్లోనూ రాణిస్తూ వచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ఆమె అనేక చోట్ల గెలుపొందింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్ షిప్ అండర్ 23 పోటీల్లో ఆమె నియోజకవర్గం నుండి జిల్లాకు ఎంపికయ్యింది. ఇటీవల జిల్లాలో జరిగిన ఎంపికలో గంగాభవాని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యింది. ఆమెను స్థానిక ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు, టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, టిడిపి నాయకుల ఎస్విఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, పాండ్రంకి రాంబాబు, జూనియర్ కళాశాల క్రీడా ఉపాద్యాయులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు జగ్గంపేట విద్యార్థిని ఎంపిక
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)