ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

NMMS పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

2 రోజుల క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేపాడ : వేపాడ మండలం బక్కు నాయుడుపేట, ఆదర్శ పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన NMMS (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ) పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు, ఇన్చార్జి ప్రిన్సిపల్ సి.హెచ్.వి రమణ మూర్తి గురువారం అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో సిరిసిల్ల జోష్న జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్రస్థాయిలో ఆరవ స్థానం సాధించింది. గతేడాది డిసెంబర్ 7న 180 మార్కులకు ఈ పరీక్ష‍ నిర్వహించగా, తుది ఫలితాలు ఈనెల 10వ తేదీన విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో సిరిసిల్ల జోష్న 148 మార్కులు, గుదే తేజ130 మార్కులు, గోకేడ పద్మ శ్రీజ 129 మార్కులు, నక్కెళ్ళ పావని 126 మార్కులు సాధించారు. ఎన్.ఎం.ఎం.ఎస్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం వారి ఖాతాలో 12,000/- నగదు జమవుతుందని, ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని ప్రిన్సిపల్‌ తెలిపారు. విద్యార్థులను ముందుండి నడిపించిన, ఇంతటి ప్రతిభకు కారుకులైన సైన్స్ ఉపాధ్యాయులు రామకృష్ణ, సోషల్ ఉపాధ్యాయిని కళ్యాణి, గణిత ఉపాధ్యాయిని శిరీషను పాఠశాల ప్రిన్సిపల్, ఇన్చార్జ్ ప్రిన్సిపల్‌లు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్