ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగుమ్మఘట్ట కెజిబివిలో ఫుడ్‌‌పాయిజన్‌..

5 రోజుల క్రితం

Students fall ill at Kasturba School
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 48 విద్యార్థినులకు అస్వస్థత

ప్రజాశక్తి-గుమ్మగట్ట (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండల పరిధిలో ఉన్న బిటి ప్రాజెక్ట్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కెజిబివి)లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మంగళవారం ఉదయం విద్యార్థినులు లేవగానే కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి అధికారులు, విద్యార్థినులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‌కెజిబివిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 279 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాలలో సోమవారం రాత్రి అన్నం, సాంబారు, బీరకాయతో భోజనం చేసి పడుకున్నారు. వారు అర్థరాత్రి సమయంలో కడుపునొప్పితో బాధపడుతుంటే పాఠశాల ప్రిన్సిపల్‌ ‌సూచన మేరకు సిబ్బంది మాత్రలు ఇచ్చారు. అయినా మంగళవారం వేకువజామున విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్కరుగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది సమాచారం మేరకు గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇద్దరు వైద్యులు, ఆరుగురు సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని చికిత్సలు చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న 17 మందిని గుమ్మఘట్ట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉందని, మరో 24 గంటలు వారందరికి చికిత్సలు కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్‌, జిసిడిఓ కవిత, ఎంఇఒ సోమశేఖర్‌‌లు కెజిబివికి చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ‌కాలవ శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్య సిబ్బందికి సూచించారు.

​
Students fall ill at Kasturba School



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్