- ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్‌లను ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు ఎస్జిటిలకు మండల స్థాయి, స్కూల్ అసిస్టెంట్లకు డివిజనల్ స్థాయిలలో నిర్వహించాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇక్బాల్ , సయ్యద్ ముస్తాక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు కలిపి నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ లతో ఎలాంటి ప్రయోజనం లేదని, ఉర్దూ ఉపాధ్యాయులు సరైన రీతిలో అవగాహన పొందులేకపోతున్నారని తెలిపారు. గతంలో నిర్వహించినట్లుగా రెండు నుండి నాలుగు మండలాలు కలిపి ఉర్దూ స్కూల్ కాంప్లెక్ సమావేశాలను నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)