శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహిళపై సామూహిక అత్యాచారం

1 గంట క్రితం

rape
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 12:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడ అజిత్‌‌సింగ్‌‌నగర్‌ వాంబే కాలనీ ‌సి బ్లాక్‌‌లో శుక్రవారం అర్థరాత్రి ఓ ఒంటరి మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నున్న సిఐ అహ్మద్‌ అలి షేక్‌ కథనం ప్రకారం... వంట పని చేసుకుంటూ వాంబేకాలనీ సి బ్లాక్‌‌లో ఉంటున్న మహిళపై అదే ప్రాంతానికి చెందిన సాయి, షేక్‌ ‌రహమతుల్లా మద్యం మత్తులో అత్యాచారం చేశారు. మద్యం పార్టీ అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దిశ పోలీస్టేషన్‌ ‌పరిధిలో ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్